What are calories in Telugu – కెలోరీలు అంటే ఏమిటి ?

కేలరీ అనేది శక్తిని కొలిచే ప్రమాణం. ఇది మన శరీరానికి అవసరమైన శక్తిని సరఫరా చేసే ఆహార పదార్థాల్లో ఉంటుంది.

కేలరీ అనగానే మన మెదడు ఏమని ఆలోచిస్తుంది?

ఎక్కువ తినే మనిషి గురించి ? లేదా చాలా తక్కువ తినే మనిషి గురించా?


మన తల్లి తండ్రులు రాత్రి సమయంలో తినకుండా పడుకోనివ్వరు.తినకపోతే బలహీనపడతారని చెబుతూ ఉంటారు.


అసలు ఆహారానికి మరియు కేలరీలకు ఏమి సంబంధం ఉంది?


మనము రోజూ తినే ఆహారంలోనే కేలరీలు ఉంటాయి. మన శరీరానికి రోజూ చేసే పనుల కోసం శక్తి కావాలి. ఈ శక్తిని మన శరీరం కేలరీల రూపంలో పొందుతుంది.


మనము చేసే పనులైన నడవడం, పరుగెత్తడం, అలాగే పడుకోవడానికి కూడా కేలరీలు అవసరమవుతాయి.
ప్రతి ఆహార పదార్థంలో కేలరీల సంఖ్య వేరుగా ఉంటుంది.


ఎక్కువ ఆహారం తింటే, మన శరీరంలో ఎక్కువ కేలరీలు చేరుతాయి.తక్కువ ఆహారం తింటే, తక్కువ కేలరీలు చేరుతాయి.


మనము రోజూ తీసుకునే కేలరీలు మరియు ఖర్చు చేసే కేలరీలు సమానంగా ఉన్నప్పుడు,
మన శరీర బరువు ఒకేలా ఉంటుంది.


ఒకవేళ ఎక్కువ కేలరీలు తీసుకుని తక్కువ కేలరీలు ఖర్చు చేస్తే ఆ కేలరీలు మన శరీరంలో కొవ్వు రూపంలో నిల్వ అయ్యే అవకాశం ఉంటుంది.


అలా ఎక్కువ మోతాదులో కొవ్వు మన శరీరంలో చేరడం వలన మనకు వివిధ రకాల వ్యాధుల (గుండె జబ్బులు, అధిక రక్తపోటు మరియు శ్వాస సమస్యలు) బారిన పడే అవకాశం ఉంటుంది.


ఎక్కువగా కెలోరీలు తీసుకోవడం వల్ల కారణంగా ఎలా సమస్యలు వస్తున్నాయి అలాగే తక్కువ కెలోరీలు తీసుకోవడం వల్ల ఈటింగ్ డిసార్డర్స్ (anorexia nervosa and bulimia nervosa) వచ్చే అవకాశం ఉంటుంది.

ఇదంతా పక్కన పెడితే, మనం ఏ విధమైన ఆహారం తీసుకుంటున్నామనేదే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.

ఆహార పదార్థాలలో ప్రధానంగా రెండు రకాలుంటాయి:

  1. ఆరోగ్యకరమైన ఆహారం (Healthy Foods)
  2. జంక్ ఫుడ్ (Junk Foods)

కింద ఇచ్చిన టేబుల్ లో ఆరోగ్యకరమైన ఆహారం మరియు జంక్ ఫుడ్‌ల మధ్య ఉన్న కేలరీల తేడాను గమనించవచ్చు.

హెల్తీ ఫుడ్స్ vs జంక్ ఫుడ్స్ :

హెల్తీ ఫుడ్స్ 🍎:

ఆహారంకేలరీలు (100g)ప్రోటీన్ (g)కార్బోహైడ్రేట్స్ (g)కొవ్వు (g)ఫైబర్ (g)
జొన్న రొట్టి (Jonna Roti)329 kcal10.472.63.67.3
సజ్జ రొట్టి (Sajja Rotte)360 kcal11.867.54.28.5
రాగి జావ (Ragi Malt)100-120 kcal2.7220.43.5

జంక్ ఫుడ్స్ 🍕 : 

ఆహారంకేలరీలు (100g)ప్రోటీన్ (g)కార్బోహైడ్రేట్స్ (g)కొవ్వు (g)ఫైబర్ (g)
మిర్చి బజ్జి (Mirchi Bajji)350-400 kcal650153
పునుగులు (Punugulu)450-500 kcal855202.5
సమోసా (Samosa)308 kcal635172

మనము రోజుకు ఎంత కేలరీలు తీసుకోవాలో వేరు వేరు కారకాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మనిషి యొక్క లింగం, ఎత్తు, బరువు మరియు వయస్సు.

సగటున ఒక మహిళకు రోజుకు 2000 కేలరీలు మరియు పురుషుడికి 2500 కేలరీలు అవసరం.

పైన చూపించిన పట్టిక ప్రకారం జంక్ ఫుడ్‌లోనూ కేలరీలు ఉంటాయి, ఆరోగ్యకరమైన ఆహారంలోనూ కేలరీలు ఉంటాయి. కానీ బ్యాలెన్స్డ్ డైట్  తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చు.

బ్యాలెన్స్డ్ డైట్ లో
50% – 60% కార్బోహైడ్రేట్లు,
15% – 20% ప్రోటీన్లు,
20% – 25% కొవ్వులు ఉండాలి.

ఈ విధంగా ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల, వ్యాధుల బారిన పడకుండా మనం ఆరోగ్యంగా జీవించగలం. 

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  

References :1) https://newsinhealth.nih.gov/2023/08/breaking-down-food 2) https://www.ncbi.nlm.nih.gov/books/NBK499909/  3) https://www.nhs.uk/live-well/healthy-weight/managing-your-weight/understanding-calories/

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.