
పైన్ ఆపిల్ ను తెలుగు లో అనాస పండు అని అంటారు. పురావస్తు శాఖ ప్రకారం దాదాపు 1200 BC నుంచే అనాస పండు సాగు ను ప్రారంభించటం జరిగింది.
పైన్ ఆపిల్ యొక్క శాస్త్రీయ నామం అననాస్ కోమోసస్, మన దేశంలో కూడా పైన్ ఆపిల్ సాగు జరుగుతుంది. పలు ప్రాంతాలలో పైన్ ఆపిల్ యొక్క మొక్క ను ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ ఔషధ గుణాలు ఈ మొక్కలో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ద్వారా వస్తాయి.
ఈ ఎంజైమ్ మొక్క యొక్క కాండం (stem) లో మరియు పండు లో ఉంటుంది. ఈ ఎంజైమ్ వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సగా ఉపయోగించటం జరుగుతుంది.
పైన్ ఆపిల్ వివిధ రకాల డిష్ లలో ఉపయోగిస్తారు. ఇండియా లో కూడా రోడ్ సైడ్ బండీల పైన స్నాక్ లాగా దొరుకుతుంది.
Table of Contents
1. న్యూట్రియంట్లు
అనాస పండులో ఒక 100 గ్రాములకు కింద చూపిన విధంగా పోషక విలువలు ఉంటాయి (1).
పేరు | మొత్తం |
శక్తి (Energy) | 50cal |
Vitamin A, IU | 58IU |
నీరు (Water) | 86g |
కార్బో హైడ్రేట్ (Carbohydrate) | 13.1g |
షుగర్ (Sugars) | 9.85g |
సుక్రోజ్ (Sucrose) | 5.99g |
ఫ్రూక్టోజ్ (Fructose) | 2.12g |
గ్లూకోజ్ (Glucose) | 1.73g |
ఫైబర్ (Fiber) | 1.4g |
ప్రోటీన్ (Protein) | 0.54g |
పొటాషియం (Potassium) | 109mg |
Vitamin C | 47.8mg |
కాల్షియం (Calcium) | 13mg |
మెగ్నీషియం (Magnesium) | 12mg |
ఫాస్ఫరస్ (Phosphorus) | 8mg |
కోలిన్ (Choline) | 5.5mg |
సోడియం (Sodium) | 1mg |
మాంగనీస్ (Manganese) | 0.927mg |
కెరోటిన్ (Carotene) | 35µg |
Vitamin A | 3µg |
Vitamin K | 0.7µg |
2.గుండె ఆరోగ్యం (Heart health) :
మన శరీరంలో గుండె ఒక ముఖ్యమైన అవయవం అని చెప్పవచ్చు. మన లైఫ్ స్టైల్ మరియు ఆహారపు అలవాట్ల వల్ల గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
జంతువుల చేసిన పరిశోధనలో 8 వారాల పాటు పైన్ ఆపిల్ పండును ఇవ్వటం జరిగింది. ఫలితంగా పైన్ ఆపిల్ లో ఉండే అంటి ఆక్సిడెంట్ మరియు కొవ్వు శాతాన్ని తగ్గించే గుణాలు ఉండటం వల్ల హైపర్ కొలెస్టెరోలేమియా (రక్తం లో కొవ్వు శాతం పెరగటం) నుంచి కాపాడటం లో సహాయపడుతుందని తెలిసింది.
పైన్ ఆపిల్ ఉండే బ్రోమెలైన్ గుండె పోటు మరియు గుండె నొప్పి లాంటి సమస్యలను తగ్గించటంలో ఉపయోగపడుతుంది. ఇంతే కాకుండా కొలెస్ట్రాల్ యొక్క ప్లేక్ (ఫలకాలను) లను విఛ్చిన్నం చేయడానికి మరియు గుండె లో రక్తం గడ్డకట్టకుండా (platelet aggregation) ఉండటంలో సహాయపడుతుంది.(1) (2) (3)
3.ఆస్టియో ఆర్థరైటిస్ (osteoarthritis) :
ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వయస్సు తో పాటు ఎముకలకు చెందిన ఒక జబ్బు, ఈ జబ్బు లో ముఖ్యంగా వాపు మరియు కీళ్ల నొప్పుల వల్ల బాధపడటం జరుగుతుంది. భారతదేశంలో ఒక సంవత్సరానికి ఒక కోటి మంది ఈ సమస్య తో భాదపడుతున్నారు.
కొన్ని అధ్యయనాల ప్రకారం పైన్ ఆపిల్ లో ఉండే బ్రోమెలైన్ వాపు కు మరియు నొప్పి కి వ్యతిరేకంగా పనిచేయటాన్ని గమనించటం జరిగింది.(3.1)
4. క్యాన్సర్ (Cancer) :
అనాస పండులో ఉండే బ్రోమెలైన్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పనిచేయటంలో దోహదపడుతుంది. క్యాన్సర్ కణాల కారణంగా ఏర్పడే కణితిలను కూడా తగ్గించే సామర్థ్యం బ్రోమెలైన్ కలిగి ఉంటుంది (4).
జంతువులలో మరియు టెస్ట్ ట్యూబ్ పరిశోధనలలో బ్రోమెలైన్ ద్వారా చికిత్స చేయటం జరిగింది, అంతే కాకుండా క్యాన్సర్ ద్వారా వచ్చే కణితులను కూడా తగ్గించినట్లు గమనించటం జరిగింది (5).
5. సర్జరీ (Surgery) :
సర్జరీ కి ముందు బ్రోమెలైన్ తీసుకోవటం వల్ల సర్జరీ తరవాత ఉండే నొప్పి మరియు వాపు ను త్వరగా తగ్గించటంలో దోహదపడుతుంది.
కొన్ని పరిశోధనల ప్రకారం అనాస పండులో ఉండే బ్రోమెలైన్ వాపు, గాయం, నొప్పి మరియు సర్జికల్ బ్లేడ్ వల్ల కలిగిన గాట్లను తగ్గించటంలో మంచిగా పనిచేస్తుంది.
ఇంతే కాకుండా తీవ్రమైన వాపును మరియు క్రీడాకారులకు జరిగే గాయాలను నయం చేయటానికి కూడా ఉపయోగించటం జరుగుతుంది (6).
6. జీర్ణక్రియ (Digestion):
అనాస పండులో జీర్ణక్రియ కు సంబంధించిన ఎంజైములు (బ్రోమెలైన్ ) ప్రోటీన్ లను జీర్ణం చేస్తాయి. కొంత మందిలో పాంక్రియాస్ సరైన మోతాదులో జీర్ణక్రియ ఎంజైములను ఉత్పత్తి చేయదు.
ఇలాంటి కండిషన్ ను ప్యాంక్రియాస్ లోపం (pancreas insufficiancy) అని అంటారు. అనాస పండులో బ్రోమెలైన్ జీర్ణ క్రియను సజావుగా జరగటానికి దోహదపడుతుంది (7)
7. మాంగనీస్ (Manganese) :
ఒక 100 గ్రాముల అనాస పండులో దాదాపు 1mg మాంగనీస్ ఉంటుంది అంటే దాదాపు ఒక రోజుకి కావలసిన మాంగనీస్ లో సగం.
మాంగనీస్ శరీరంలో మంచి ఇమ్యూనిటీ కలిగించడానికి, బ్లడ్ మరియు షుగర్ స్థాయిలను నియంత్రించడానికి, రక్తం గడ్డకట్టడానికి మరియు ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతుంది (8).
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply